వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదానంద ప్రమాణం, జగదీష్ షెట్టర్ గ్రూప్ డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sadananda Gowda
బెంగళూరు: కర్ణాటక 26వ ముఖ్యమంత్రిగా సదానంద గౌడ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన జగదీష్ షెట్టార్ వర్గం శానససభ్యులు హాజరు కాలేదు. దాదాపు 50 మంది శాసనసభ్యులు సదానంద గౌడపై తిరుగుబాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా, షెట్టర్ వర్గాన్ని చేరదీసేందుకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనిషిని కానని ఆయన సంకేతాలిస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తగిన స్థానాల కోసం షెట్టర్ వర్గం పట్టుబడుతోంది.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనకు విశ్వాసపాత్రుడైన అనుచరుడు అనుకున్న కొత్త ముఖ్యమంత్రి సదానంద గౌడ అప్పుడే ఝలక్ ఇచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరికీ కీలు బొమ్మను కాదని చెప్పారు. రాజకీయాలలో చాలా కాలంగా ఉంటున్నానని సమస్యలను ఎలా పరిష్కరించాలో తనకు బాగా తెలుసునని చెప్పారు. దీంతో సదానంద గౌడ ఎన్నికైన నాటి నుండే యడ్యూరప్పరకు తలనొప్పులు ప్రారంభమైనాయని పలువురు చెప్పుకోవడం విశేషం.

English summary
New BJLP leader Sadananda Gowda gave shock to former chief minister Yeddyurappa today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X