వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో సోనియా, తెలంగాణ ఎంపిలకు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికాలో ఉన్నారు. అస్వస్థత కారణంగా ఆమె అమెరికా వెళ్లారు. దీంతో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు షాక్ తగిలినట్లే. తెలంగాణపై సోనియా వస్తే గానీ తేలే పరిస్థితి ఉండదని పార్టీ అధిష్టానం వారికి చెప్పి వెనక్కి రావాలని అడిగే అవకాశం ఉంది. సోనియాకు శస్త్ర చికిత్స అవసరమా, లేదా అనేది వైద్యులు నిర్ణయిస్తున్నారని కాంగ్రెసు అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు.

అమెరికాలో ఉన్న సోనియా ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఆమెకు అమెరికాలో ఎక్కడ శస్త్రచికిత్స జరుగుతుంది అనే విషయాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. రెండు మూడు వారాల పాటు ఆమె అమెరికాలోనే ఉంటారు. అక్కడే ఆమె విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తారు. వైద్యుల సలహా మేరకు ఆమె అమెరికా పర్యటనకు సిద్ధపడ్డారని ద్వివేదీ చెప్పారు.

తన గైర్హాజరీలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను ఆమె నలుగురు నాయకులకు అప్పగించారు. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

English summary
Congress president Sonia Gandhi has been unwell, and has undergone surgery in the US, the Congress has said. A Congress spokesman said the surgery has been successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X