వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై పార్లమెంటులోనూ చిదంబర అదే పాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలలో ఏకాభిప్రాయం లేదన్నారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అఖిలపక్షం పెట్టినా పరిష్కారం లభించడం లేదన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం వారు కలిసి ఉందామంటే మరో ప్రాంతం వారు విడిపోదామని అంటున్నారన్నారు. శ్రీకృష్ణ రిపోర్టులో ఏం రాయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక స్వతంత్రంగానే ఇచ్చిందన్నారు.

రహస్య నివేదిక ఇవ్వాలని కమిటీకి తాము సూచించలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రాష్ట్రంలో అందరూ తెలంగాణ కోరుకున్నారని ఆ ప్రకటన తర్వాత ప్రాంతాల వారిగా చీలిపోయారన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో సైతం ప్రాంతాల వారిగా చీలిక వచ్చిందన్నారు. సామరస్య పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువకుల ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.

సిపిఐ, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలలో ఏకాభిప్రాయం లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసి పోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు పరిష్కారం రాష్ట్రం నుండే రావాలని పార్లమెంటు కేవలం వేదిక మాత్రమే అని చెప్పారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Union Minister Chidambaram repeated again his statement in Parliament on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X