వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకే: సర్వే సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
న్యూఢిల్లీ: తాను పక్కా తెలంగాణ వాదినని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ లోకసభలో చెప్పారు. నిఖార్సయిన తెలంగాణవాదినని అన్నారు. తెలంగాణపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలా కాంగ్రెసు కూడా ఖచ్చితమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లు వచ్చి కలిశారన్నారు. ఆంధ్రావారు తమని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని అన్నారు. ఆంధ్రా వారు తెలంగాణ వారిని పూర్తిగా అణగదొక్కారని అన్నారు. ఇష్టం లేకపోతే విడిపోవచ్చునని నెహ్రూ చెప్పారని అన్నారు.

తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తారని తమకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో సోనియా లేక పోవడం బాధాకరం అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ మా జన్మహక్కు అన్నారు. అయితే టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వలె తాము ఆంధ్రా వారు బాగో అనడం లేదన్నారు. నాడు బలవంతంగా భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణ, ఆంధ్రను కలిపారన్నారు. ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ అన్నారు. ప్రజల భావోద్వేగాలను సోనియా అర్థం చేసుకున్నారని అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు.

హైదరాబాదు లేని తెలంగాణ మెడలేని మొండెం వంటిదన్నారు. ఉద్యమాలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ స్తంభించాయన్నారు. గూర్ఖాలాండు తరహా ప్యాకేజికి తాము వ్యతిరేకం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఏమీ తేల్చకుండా ఇలా అలా చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలు ఇచ్చిన బిజెపి ఆనాడే పట్టించుకుంటే ఇబ్బంది ఉండక పోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అడ్డుపడిన తెలుగుదేశం పార్టీ ఆలోచనలో నేటికి మార్పు లేదన్నారు. చంద్రబాబు అప్పుడు ఇప్పుడూ అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ వాదులు ఏ పార్టీలో ఉన్నా అందరూ సోదరులే అన్నారు.

English summary
MP Survey Satyanarayana said Telugudesam party president Chandrababu Naidu is main villain to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X