హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సుష్మా స్వరాజ్‌కు సర్వే మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana-Sushma Swaraj
హైదరాబాద్: తెలంగాణపై పార్లమెంటులో ధాటిగా మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ నేత సుష్మా స్వరాజ్‌ను తెలంగాణవ్యాప్తంగా పలువురు తెలంగాణవాదులు పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో బిజెపి కార్యకర్తలు పలువురు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. వరంగల్ జిల్లాలో బిజెపి జిల్లా నేతలు, కార్యకర్తలు సుష్మా స్వరాజ్‌కు పాలాభిషేకం చేశారు. తెలంగాణపై కాంగ్రెసు ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ సుష్మా స్వరాజ్ బాగా ప్రసంగించిందంటూ ఉత్సాహం ప్రదర్శించారు. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ మాట్లాడిన తీరుపై తెలంగాణవాదులు సైతం పార్టీలకతీతంగా అభినందించారు.

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత నాగం జనార్దన్ రెడ్డి, బిజెపి చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణవాదులు సైతం బిజెపి వైఖరిని నిరసించినప్పటికీ సుష్మా స్వరాజ్ తెలంగాణపై మాట్లాడటంపై సానుకూలంగా స్పందించారు. సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నప్పుడు సీమాంధ్ర నేతలు నిరసనలు తెలిపిన సమయంలో సాక్ష్యాత్తూ కాంగ్రెసు ఎంపీ సర్వే సత్యనారాయణ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక సోదర, సోదరీమణులారా తెలంగాణ కోసం బలిదానం వద్దు... తెలంగాణ కోసం బతకండి అని ఆమె తెలుగులో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అందరూ బల్లలు చరిచి అభినందించారు.

English summary
Telanganites supported BJP leader Sushma Swaraj today after her talk in Parliament on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X