వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమం: అధికార ప్రతినిధిగా రేణుక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
న్యూఢిల్లీ: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఏఐసిసి అధికార ప్రతినిధిగా తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఏఐసిసి అధికార ప్రతినిధులుగా ముగ్గురిని తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీలతో పాటు రేణుకా చౌదరిని సైతం తీసుకున్నారు. మీడియా డిపార్టుమెంట్ చైర్మన్‌గా జనార్దన్ ద్వివేదిని తీసుకున్నారు. కాగా రేణుకా చౌదరిని తీసుకోవడం వెనుకు చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ మీడియా ప్రతినిధులు తెలంగాణపై కాంగ్రెసు పార్టీని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ డైనమిక్ లీడర్‌ను అధికార ప్రతినిధిగా నియమించాలనే ఉద్దేశ్యంతో పార్టీ రేణుకను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో ఫిమేల్ లీడర్ ఉంటేనే బావుంటుందని పార్టీ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రతినిధి కావడంతో ఆచితూచి మాట్లాడే అవకాశముందని ఆమెను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గతంలో ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకున్న సమయంలోనే పార్టీలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపించాయని తెలుస్తోంది. కాగా రేణుకకు రీసెర్చ్ కో ఆర్డినేషన్ లోనూ చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Congress party high command welcomed Renuka Chowdary in to AICC due to Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X