వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోలుకుంటున్న సోనియా, ఐసియు నుంచి మార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: అమెరికాలోని ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలుకుంటున్నారు. ఆమెను ఐసియు నుంచి ప్రత్యేక గదిలోకి మార్చారు. సోనియా ఐసియులో 24 గంటల పాటు ఉన్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి మార్చారని, సోనియా కోలుకోవాలని కోరుతూ సందేశాలు పంపిన వారందరికీ ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారని కాంగ్రెసు మీడియా శాఖ అధిపతి జనార్దన్ ద్వివేది శనివారం చెప్పారు.

సోనియా గాంధీ రెండు, మూడు వారాల్లో భారతదేశానికి తిరిగి వస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సోనియా గైర్జాజరీలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 4వ తేదీన సోనియాకు అమెరికాలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.

English summary
Congress President Sonia Gandhi has been moved out of the ICU in a US hospital where she underwent a surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X