వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చిరు, చంద్రబాబు, రోశయ్య కలిసి అడ్డుకున్నారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukhendar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముగ్గురు కలిసి తెలంగాణ అడ్డుకున్నారని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి రోశయ్య అసెంబ్లీలో తీర్మానం పెట్టక పోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. అధిష్టానం చెప్పింది చేసినప్పుడే సమర్థవంతమైన నాయకుడు అనిపించుకుంటారని అన్నారు.


తమ పార్టీ నేత రోశయ్య తెలంగాణ ద్రోహిగా మిగలకూడదన్నదే తన బాధ అని అన్నారు. తీర్మానం పెడితే వీగిపోతుందని రోశయ్య కలగన్నారా అని ప్రశ్నించారు. కాగా పార్టీ నేతలు కొందరు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నిజాలు తెలియకుండా చేస్తున్నారని మరో నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. 2014 వరకు తెలంగాణ రాకపోతే అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తీర్మానం చేశాక మళ్లీ ఏకాభిప్రాయం అనడం రాజకీయ దివాళాకోరుతనం అని అన్నారు. తెలంగాణ రాకపోవడం పార్టీ వైఫల్యమే అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 9న తెలంగాణ కోసం దీక్షలు చేపడతామని అన్నారు.

English summary
MP Gutta Sukhendar Reddy blamed Chiranjeevi, Rosaiah and Chandrababu Naidu for Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X