వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah and Gutta Sukhendar Reddy
హైదరాబాద్: కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన సమయంలో నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో రాజీనామా చేయించారని ఓ టీవీ ఇంటర్య్వూలో కాంగ్రెసు పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి పోయిందని అన్నారు. తెలంగాణపై రోశయ్య నాటకాలు ఆడారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఆరువందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అందులో రోశయ్య బాధ్యత కూడా ఉందని ఆయన అన్నారు. సీమాంధ్రులతో రాజీనామా చేయించిన విషయం తనకు మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్వయంగా చెప్పారని అన్నారు.

దీనికి స్పందించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుత్తా తనపై దారుణమైన నిందలు వేస్తున్నారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పాసు చేయించలేనని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి స్పష్టం చేశానని ఆయన అన్నారు. గుత్తా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాని కోరారు. తనకు కుట్రలు, కుతంత్రాలు చేసే తెలివి లేదని అన్నారు. చిదంబరం స్థాయిని ప్రశ్నించే స్థాయి తనకు లేదని అయితే తనపై అవాస్తవ అభాండాలు వేయొద్దని కోరారు.

English summary
Gutta Sukhendar Reddy blamed former chief minister Rosaiah for seemandhra leaders resignations after December 9th statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X