వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేయడం నాకు చేతకాదు: కొణిజేటి రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rossaiah
హైదరాబాద్: ఢిల్లీలో తీర్మానం పెడతానని చెప్పి ఇక్కడకు వచ్చి తీర్మానం పెట్టకుండా మాటలు మార్చడం తనకు తెలియదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం మీడియాతో అన్నారు. తనను కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా వివాదంలోకి లాగుతున్నందునే తాను వివరణ ఇస్తున్నానని కానీ తెలంగాణకు తాను వ్యతిరేకమో, అనుకూలమో కాదని చెప్పారు. 2009లో తీర్మానం ప్రవేశ పెట్టినా వీగిపోతుందనే ఉద్దేశ్యంతోనే తాను తీర్మానం ప్రవేశ పెట్టలేదని చెప్పారు. తీర్మానం ప్రవేశ పెట్టినా వీగిపోవాలని కొందరు నేతలు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.

తీర్మానం వీగిపోతుందనే విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగుకు తాను చెప్పానని అన్నారు. వీగుతుందని తీర్మానం వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. గుత్తా సుఖేందర్ లాంటి నేతలు తనను అపార్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశించినా పరిస్థితులను బట్టే తీర్మానం పెట్టలేదని అది పార్టీకి వివరించానని అన్నారు. డిసెంబర్ 9 వరకు పరిస్థితులు మొత్తం సోనియాకు వివరించానని అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలు మీడితో చెప్పలేనని అన్నారు.

ఏకాభిప్రాయంతోనే సమస్య పరిష్కారం అంటే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు అన్నారు. తన మిత్రుల్లా తాను ఏ వాదాన్ని భుజాన వేసుకోనని అన్నారు. కలిసుంటే పరస్పరం అర్థం చేసుకొని ఉండాలని, విడిపోవాలనుకుంటే అన్నదమ్ముల్లా విడిపోవాలని సూచించారు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏకాభిప్రాయం జరిగిందో లేదో చూడాలంటే రికార్డులు పరిశీలించాలని చెప్పారు. తెలంగాణ అంశం రోజు రోజు జఠిలం అవుతుందన్నారు.

English summary
Former chief minister Konijeti Rosaiah said today he did not want to make mistakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X