హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రద్దు లేకుంటే మరో మిలియన్ మార్చ్, బంద్ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: 14ఎఫ్ రద్దు చేయకుండా ఎస్సై పరీక్షలు నిర్వహిస్తే మరో మిలియన్ మార్చ్ చూస్తారని తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 14ఎఫ్ రద్దు చేశాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. 14ఎఫ్ పై ఈ నెల 12లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే 13, 14వ తారీఖుల్లో తెలంగాణ వ్యాప్త బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

15వ తారీఖున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. కాగా ఈ నెల 8వ తలపెట్టిన తెలంగాణ బందును కొన్ని కారణాల వల్ల 10వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బందు కార్యక్రమం ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. మొదట 5వ తేదిన బందు ప్రకటించారు. అ తర్వాత 8కి మార్చారు. ఇప్పుడు 8 నుండి 10వ తేదికి మార్చారు.

English summary
Telangana Student JAC warned state government that million march will repeat if SI exams conduct without cancel 14F.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X