వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాగ్‌పై దద్దరిల్లిన పార్లమెంటు, షీలా రాజీనామాకు డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: సోమవారం పార్లమెంటు ఉభయ సభలు కాగ్ నివేదికపై దద్దరిల్లాయి. కామన్వెల్తు క్రీడల అక్రమాలలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాగ్ తప్పు పట్టిన నేపథ్యంలో ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాజ్యసభ, లోకసభలో కామన్వెల్తు క్రీడల అక్రమాలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించక పోవడంతో చర్చలకు అంగీకరిస్తేనే సభను అడ్డుకోమని లేదంటే సభ జరగనివ్వమని ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోకసభలో స్పీకర్, రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ సభలను మంగళవారానికి వాయిదా వేశారు.

కాగా గత సంవత్సరం జరిగిన కామన్వెల్తు క్రీడలలో సురేష్ కల్మాడీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షీలా దీక్షిత్‌ను వెంటనే తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లేదా ఆమె రాజీనామా చేయాలని పట్టుబట్టాయి.

English summary
Parliament adjourned to tuesday today. Oppositions demanded government to talk about CAG report. But government not accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X