హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సమ్మె: ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ నెల 17వ తేదీనుంచి తెలంగాణ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగులుగా మారే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈ నెల 17వ తేదీ నుంచి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ ఎన్‌జివోల సంఘం విమర్శిస్తోంది. సమ్మెకు మద్దతిస్తామని తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చెబుతన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాల నాయకులు అంటున్నారు.

కాగా, ప్రభుత్వం రక్షణ కల్పిస్తే సమ్మె కాలంలో తాము విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎపిఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాదులో మినహా తెలంగాణ జిల్లాల్లో తమ ఉద్యోగులకు రక్షణ లేదని ఆయన చెప్పారు. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.

కాగా, సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమవారం తెలంగాణ వైద్యులు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద మహా దీక్షకు దిగారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ సందర్శించారు. తెలంగాణ ఉద్యోగుల దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

English summary
In the wake od Telangana employees strike from August 17, APNGOs president Gopal reddy expressed his willingness to work during strike period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X