హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఏఎస్ లైంగిక వేధింపులు, పోలీసులపై మహిళ దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తనను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ సిసిఎస్ పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ వత్సల అనే మహిళ సోమవారం హైదరాబాదులోని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.

అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని సమాచారం. తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదని ఆరోపిస్తూ వత్సల సిసిఎస్ పోలీసులపై దాడికి ప్రయత్నం చేసింది. దీంతో తమపై దాడికి యత్నించిన వత్సలను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Woman is tried for attack on CCS police today in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X