వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెట్ దుర్వినియోగంలో భారత్ నెంబర్ వన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

India No.1 in Net misuse
న్యూఢిల్లీ: ఆఫీసులలో పని చేసే సమయాల్లో అంతర్జాలాన్ని(ఇంటర్నెట్) ఎక్కువ నిరుపయోగం చేస్తున్న వారిలో భారతీయులే ముందున్నారట. కార్యాలయాల్లో పని చేసే సమయాల్లో షేర్ల వ్యాపారం, ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారని ఓ సంస్థ చేసిన ఆధ్యయనంలో తేలిందంట. ఆఫీసు పని వేళల్లో సొంత పని చేసుకోవడంలో మధ్య ప్రాచ్య దేశాల కంటే మనమే ముందున్నాం. ఆఫీసు పనుల్లో వ్యక్తిగత పనుల కోసం అంతర్జాలం వాడకంపై భారత్, సింగపూర్, మధ్యప్రాచ్య దేశాలో సదరు సంస్థ సర్వే జరిపింది. ఇరవై రెండు వేల మందికి పైగా ఉద్యోగులు, మూడు వేలకు పైగా మేనేజర్లను ఈ సంస్థ ప్రశ్నించింది.

మన దేశంలో 59 శాతం మంది, సింగపూర్‌లో 53 శాతం మంది, మధ్య ప్రాచ్య దేశాల్లో 37 శాతం మంది ఆఫీసు పనుల్లో వ్యక్తిగత పనుల కోసం అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారంట. అయితే ప్రధానంగా వారు షేర్ల వ్యాపారం కోసం, ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట. వారానికి పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల వరకు షేర్ల వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నామని 32 శాతం మంది చెప్పగా, 11 గంటల వరకు ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నామని చెప్పిన వారు 29 శాతం మంది ఉన్నారట. ఆ తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట.

అయితే ఉద్యోగుల ఇంటర్నెట్ వాడకంపై నిఘా పెడతామని సింగపూర్ మేనేజర్లు 77 శాతం, మద్య ప్రాఛ్య దేశాల్లో 49 శాతం మంది, భారత్‌లో 62 శాతం మంది చెప్పడం విశేషం. మధ్య ప్రాచ్య దేశాల కన్నా మన దేశంలో చాలా నిఘా ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ను వ్యక్తిగత పనుల కోసం వాడటం ఎక్కువగానే ఉందన్నమాట.

English summary
Indians are in first place in internet misuse in the office timings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X