హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మెపై వెనక్కి తగ్గుతూనే అణచివేతకు యత్నం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని ఓ వైపు విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు దానిని అణిచి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేనంతంగా సకల జన సమ్మెకు స్థానిక పోలీసు యంత్రాంగం సైతం లోపాయికారిగా మద్దతు ఇస్తుందనే వార్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆయన స్థానిక పోలీసు కంటే కేంద్ర బలగాల పైనే ఆధారపడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర బలగాలను దించి సమ్మెను పూర్తిగా అణిచి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. మంత్రివర్గం ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం భేటీ అయి ఉద్యోగల సమ్మె, ఎస్మాపై చర్చించాయి.

అయితే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించకూడదనే నిర్ణయానికి ఉపసంఘం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వనుంది. అయితే ఎస్మాను ప్రయోగించకుండా సర్వీసు రూల్సు కఠినంగా పెట్టాలని ఉపసంఘం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు మద్దతు ఇచ్చిన పక్షంలో వారిని విధుల నుండి తప్పించాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం భావిస్తోందని సమాచారం. అలా చేయడం వల్ల సమ్మె ఉధృతిని తగ్గించవచ్చని వారి అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. సిఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని ఉపసంఘం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. కేంద్రం నిర్ణయం వచ్చే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని ఉపసంఘం ఉద్యోగులను కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్మా ప్రయోగం లేదని చెప్పినప్పటికీ దానిని సుప్తావస్థన చేతనలో ఉంచాలని సిఎం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ నెల 13న బిహెచ్ఇఎల్‌లో జరిగే ఎస్సై పరీక్షలను అడ్డుకునే వారిని అరెస్టు చేస్తామని ఐజి రతన్, డిఐజి నాగిరెడ్డి చెప్పారు. ఎస్సై పరీక్షలకు బిహెచ్ఇఎల్‌లో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు ఐడి కార్డులు తెచ్చుకోవాలని వారు సూచించారు. ఎవరు అడ్డుకున్నా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

English summary
It seems, State government decided to cancel ESMA on Telangana employees strike. Government ready to talk with employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X