హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్న ఆశయం కోసం ప్రాణత్యాగం: పిజెఆర్ తనయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishnuvardhan Reddy
హైదరాబాద్: తన తండ్రి, దివంగత కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ఆశయ సాధన కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సైతం సిద్దమని జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్దన్ రెడ్డి మంగళవారం అన్నారు. తన తండ్రి స్ఫూర్తితో తెలంగాణ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రాంత మంత్రులు ఫైళ్ల మీద సంతకాలు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. శాసనసభ్యులు సైతం నియోజకవర్గాలలో జరిగే శంఖుస్థాపనలకు దూరంగా ఉండాలని సూచించారు.

కాగా గత నెల నాలుగో తారీఖున తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చినప్పుడు విష్ణువర్దన్ రెడ్డి అందరికంటే ముందుగా రాజీనామాతో వచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అయితే అందులో తెలంగాణ కోసం రాజీనామా అంటూ కొన్ని సూచనలు చేయడంతో అది చెల్లలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ రాజీనామా చేశారు.

English summary
Jubilee Hills MLA Vishnuvardhan Reddy said today that he will scarify his life for Telangana for true his father P Janardhan Reddy dreams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X