• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణపై రాజకీయ నేతలకు స్వామి గౌడ్ సవాల్

By Srinivas
|

Swamy Goud
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనపై తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ మంగళవారం సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్ధిష్ట గడువులోగా తీసుకు వస్తామని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హామీ ఇస్తే తాము ఉద్యమం నుండి తప్పుకుంటామని అన్నారు. తాము ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వస్తామని చెప్పలేదన్నారు. కేవలం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నరాజకీయ నేతలకు బాసటగా నిలిచామని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారమైతే సమ్మె ఉండదు, ఎస్మా ఉండదని స్వామి గౌడ్ స్పష్టం చేశారు.

కాగా అంతకుముందు బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్ జిల్లాలో మాట్లాడుతూ ఉద్యోగులను సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన బాధ్యత రాజకీయం అయిన తమపై ఉందని ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేయకుండా ఉద్యోగాలు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. పలువురు నేతలు సైతం ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకోవాలని కోరుతున్నారు.

English summary
TNGO leader Swamy Goud challenged Telangana leaders that employees will withdraw from agitation if they promised on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more