• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సిఎంను శంకించొద్దు, చర్చలకు మళ్లీ రండి: ఆనం

By Srinivas
|

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తశుద్ధిని శంకించవద్దని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉద్యోగులు మరోసారి చర్చలకు రావాలని మంత్రివర్గ ఉపసంఘం కోరింది. గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు చర్చలకు రావాలని కోరారు. ఎస్మా పరిధిలోకి ఇప్పటి వరకు 8 శాఖలను తీసుకు వచ్చినట్లు ఆనం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సుహృద్భావంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సమస్యను చర్చించుకోవచ్చునని అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు.

భద్రతా దళాలు రక్షణ కల్పించేందుకే తప్ప ఎవరిపై ఒత్తిళ్లు తీసుకు రావడానికి కాదని అన్నారు. బందులు, సమ్మెల వల్ల గణేష్, రంజాన్ ఉత్సవాల పవిత్రత దెబ్బతింటుందని ఆయా మతపెద్దలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. 610 జివో అమలు కోసం న్యాయ కమిటీని ఏర్పాటు చేయడం మినహా అన్ని సమస్యలను పరిష్కరించామని అన్నారు. తమ పరిధిలో లేని అంశంపై ఉద్యోగులు మొండి పట్టుదలకు పోవద్దని విజ్ఞప్తి చేశారు.

English summary
Cabinet sub committee called TNGO leaders for talks. Anam Ramanarayana Reddy appealed employees to withdraw strike for public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more