చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జారిపడి గాయపడిన అందాల తార సమీరా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sameera Reddy
చెన్నై: ఓ తమిళ సినిమా షూటింగు సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కోయంబత్తూరులో షూటింగు జరుగుతుండగా ఆమె తీవ్రగాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే ఆమె రెండు మూడు రోజులలో కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ అంతగా ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో వెట్టై అనే చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర హీరో ఆర్య కాగా ప్రముఖ హీరో మాధవన్ పోలీసు అధికారి పాత్రలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

వెట్టై సినిమా కోసం కోయంబత్తూరులో హీరో హీరోయిన్లతో వాన పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాటలో సందర్భానుసారం సమీరా మోపెడ్‌పై వస్తుండగా నీటి ధాటికి ఆమె నడుపుతున్న మోపెడ్ స్లిప్ అయి జారి పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు మూడు రోజులు రెస్టు తీసుకొని మళ్లీ షూటింగులో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Bollywood heroine Sameera Reddy injured while Vettai tamil cinema shooting at Coimbatore of Tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X