వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీని వైయస్ విజయమ్మ నడపాల్సిందేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నడపాల్సి వస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైయస్ జగన్ ఆస్తులపై హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ పరిస్థితి తప్పదని అనుకుంటున్నారు. సిబిఐ కేసులో జగన్ అరెస్టవుతారా, లేదా అనే విషయంపై నేరుగా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదే పరిస్థితి వస్తే వైయస్ విజయమ్మ పార్టీని నడుపుతారని పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటివారు ఇప్పటికే చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ్ రావు ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పారు.

జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం వల్ల పార్టీపై ఏ విధమైన ప్రభావం ఉండదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ వంటి నాయకులు అంటున్నారు. తాము ప్రజల ముందుకు వెళ్తామని, ప్రజా కోర్టులో తేల్చుకుంటామని కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు కుట్ర చేసి తనను కేసులో ఇరికించాయనే వాదనతో జగన్ ప్రజల ముందుకు వెళ్తారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే, ప్రస్తుత పరిణామం వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్‌ వెంట నడుస్తున్న చాలా మంది ప్రస్తుత పరిణామంతో వెనక్కి తగ్గవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బద్ధ విధేయులు తప్ప మిగతా వారు పునరాలోచనలో పడతారని అంటున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు పలువురు ఇప్పటికే పునరాలోచనలో పడినట్లు కూడా సమాచారం. ఏమైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తుకు ఏ విధమైన డోకా ఉండదని పార్టీ నాయకులు భావిస్తున్నా ఏదో మేరకు ప్రభావం తప్పకుండా ఉంటుందనే అభిప్రాయానికే బలం చేకూరుతోంది.

English summary
YS Vijayamma may lead YSR Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X