గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

14ఎఫ్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళతాం: జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 14ఎఫ్ రద్దు రాజ్యాంగ విరుద్దమని కేంద్ర ప్రభుత్వం దానిని రద్దు చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ శుక్రవారం అన్నారు. 14ఎఫ్ రద్దు చేయడం సరికాదన్నారు. 14ఎఫ్ రద్దు వల్ల విద్యార్థులు నష్ట పోతారని అన్నారు. హైదరాబాదు రాజధాని అని అన్నారు. కాగా 14ఎఫ్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. 14ఎఫ్ రద్దుపై సీమాంధ్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మాత్రం దానిని ఆహ్వానిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి 14ఎఫ్ రద్దు విజయం ముఖ్యమంత్రిది అన్నారు. 14ఎఫ్ రద్దుపట్ల సీమాంధ్ర విద్యార్థులు బాధ పడవద్దని సూచించారు. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినందు వల్లనే 14ఎఫ్ రద్దయిందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంతటితో ఆగితే బావుంటుందని అభిప్రాయపడ్డారు.

English summary
Former MLA Jayaprakash said today that they will go Supreme Court on 14F cancellations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X