వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హసన్ అలీ ఖాన్‌కు బొంబాయి హైకోర్టు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hasan Ali
ముంబై: కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కుంభకోణం కేసులో పూణే స్టడ్ ఫామ్ యజమాని హసన్ అలీ ఖాన్‌కు బొంబాయి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హసన్ అలీ బెయిల్‌కు అర్హుడేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై జస్టిస్ ఎఎం తిప్సే అలీకి బెయిల్ మంజూరు చేశారు. ప్రతి రోజూ ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాలని, ముంబైలో లేదా పూణేలో ఉండాలని హైకోర్టు షరతులు పెట్టింది.

బెయిల్ ఉత్తర్వుల అమలును వారం రోజుల పాటు నిలిపేయాలని, ఈలోగా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని అదనపు సొలిసిటర్ జనరల్ డేరియస్ ఖంబాటా హైకోర్టును కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని తిప్సే తోసిపుచ్చారు. హసన్ పారిపోతాడని గానీ సాక్ష్యాలను తారుమారు చేస్తాడని ఊహించుకోవాల్సిన అవసరం లేదని, బెయిల్ ఆదేశాలను నిలిపేయాల్సిన అవసరం లేదని అన్నారు. హనస్ అలీ ఖాన్ మార్చిలో అరెస్టయ్యాడు.

English summary
The Bombay high court on Frday granted bail to Pune stud farm owner Hasan Ali Khan, arrested in March for alleged involvement in multi-crore money laundering scam, observing that there is nothing in Enforcement Directorate's case to show that the money amassed by him are proceeds of crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X