వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14ఎఫ్ రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు, తొలగిన అడ్డంకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: ఎస్సై పరీక్షలకు అడ్డంకులు తొలిగాయి. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14ఎఫ్ రద్దు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13వ ఎస్సై పరీక్షలు ఉన్న విషయం తెలిసిందే. 14ఎఫ్ రద్దు చేయకుంటే పరీక్షలు అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో పరీక్షలకు అడ్డంకులు తొలగినట్లయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో హోంశాఖ నుండి రాష్ట్రపతి వరకు ఫైలు చక చకా కదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్టయింది.

కాగా అంతకుముందు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14ఎఫ్ రద్దు చేస్తానని తమకు హామీ ఇచ్చారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం అన్నారు. మధ్యాహ్నం వారు ప్రతిభా పాటిల్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఎంపీ నామా నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. 14 ఎఫ్ రద్దును వెంటనే తొలగించాలని రాష్ట్రపతిని కోరామని అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. శుక్రవారమే తొలగిస్తామని చెప్పారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టేలా చూడాలని కోరామన్నారు.

గత డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన, ఆ తర్వాత పార్లమెంటులో తెలంగాణ కోసం మాట్లాడిన వాటిని ఆమె దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పామన్నారు. తెలంగాణ కోసం అమాయకులైన యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని చెప్పామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆమెతో చెప్పామన్నారు. కాంగ్రెసు ద్వంద్వ వైఖరిని ఆమె దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

English summary
Telangana Telugudesam party leaders said today that President Pratibha Patil promised to cancel 14F soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X