తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై నారాయణ, తెలంగాణపై రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu-Narayana
తిరుపతి/ విశాఖపట్నం: తన ఆస్తులపై సిబిఐ విచారణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వాదనను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తప్పు పట్టగా, తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తప్పు పట్టారు. వైయస్సార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, సంపదకు వారసుడినని చెప్పుకుంటున్న వైయస్ జగన్ అవినీతికి రాష్ట్ర మంత్రివర్గాన్ని బలిచేయవద్దని నారాయణ శనివారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజకీయ అవినీతికి వైయస్ జగన్‌పై సిబిఐ విచారణ పరాకాష్ట అని ఆయన అన్నారు.

కాంగ్రెసు అధిష్టానం అవకాశవాద రాజకీయాలు చేస్తోందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బొమ్మలా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు విశ్వాసం కల్పిస్తూ క్రాప్ హాలిడేపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వైఖరి సరైంది కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని అనిశ్చితికి స్వస్తి చెప్పాలని ఆయన శనివారం విశాఖపట్నంలో కోరారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెబుతున్న చిదంబరం శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేశారని ఆయన అడిగారు. మన్యం గిరిజనులపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్సించారు. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

English summary
CPI state secretary K Narayana questions YSR Congress party president YS Jagan's arguement on CBI probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X