చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళులపై అమెరికా దౌత్యవేత్త జాత్యహంకార వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
చెన్నై: తమిళులపై అమెరికా దౌత్యాధికారి ఒకరు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. తమిళుల మాదిరిగా మురికిగా, నల్లగా అయిపోయానని అతను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. దీనిపై తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఒరిస్సా వరకు తాను రైల్లో 24 గంటలు ప్రయాణించానని, 72 గంటల తర్వాత కూడా గమ్యానికి చేరుకోలేకపోయానని, తన చర్మం తమిళుల మాదిరిగా మురిగ్గా, నల్లగా అయిపోయిందని అణెరికా వైస్ కాన్సుల్ మౌరీన్ చావో అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుటి రెండు దశాబ్దాల క్రితం అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఆ విధంగా అన్నారు.

ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. దాంతో వెంటనే అమెరికా కాన్సులేట్ నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రసంగం సందర్భంగా చావో అనవసరమైన వ్యాఖ్యలు చేశారని, ఆ దురదృష్టకరమైన వ్యాఖ్యలకు ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారని, ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని కాన్సులేట్ వివరణ ఇచ్చింది. తాను భారతదేశంలో అధ్యయనం సందర్భంగా 23 ఏళ్ల క్రితం పొందిన అనుభవాన్ని చావో సానుకూల దృక్పథంతోనే మాట్లాడారని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ ఇటీవల భారత పర్యటనలో చేసిన ప్రకటనను గుర్తు చేసింది.

English summary
A US diplomat was caught in a row after her remarks of "dirty and dark" Tamilians, prompting the American Consulate here to term them as "inappropriate"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X