హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన భార్యను కత్తిపీటతో దారుణంగా హత్య చేసిన ఓ భర్త ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాజధాని నగరం హైదరాబాదులో చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని భరత్ నగర్‌లో వేరే రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం జీవిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవ జరుగుతుండేదని సమాచారం. శనివారం సైతం భార్య, భర్త మండూరాంకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

అయితే ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెవరక పోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో భార్య, భర్తలు రక్తపుమడుగులో కనిపించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కత్తిపీటతో భార్యను చంపి తాను ఆత్మహత్యకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. భార్య అప్పటికే మరణించింది. మండూరాంను పోలీసులు గాంధీ ఆస్పిటల్ తరలించారు. ఆయన పరిస్థితి సైతం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

English summary
Husband killed her wife with nife yesterday night in Uppal of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X