వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెసు మరో గడువు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukhendar Reddy
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తమ పార్టీ అధిష్టానానికి మరో గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 30వ తారీఖు లోగా తెలంగాణ అంశంపై తేల్చాలని వారు అధిష్టానాన్ని కోరారు. సెప్టెంబర్ 17లోగా నిర్ణయం తీసుకోవాలని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పరోక్షంగా తెలంగాణ ఉద్యమానికి 45 రోజుల పాటు విరామం ప్రకటించినట్లుగా అయింది. ఆదివారం ఉదయం రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇంట్లో టి-కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజు తెలంగాణలో మంత్రులు జాతీయ పతాకాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగురవేస్తారని చెప్పారు. మంత్రులు విధులకు దూరంగా ఉంటారని అన్నారు. రాజీనామాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కూల్చాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఎదురైన సమయంలో ఆలోచిస్తామన్నారు. తమ అంతిమ లక్ష్యం మాత్రం తెలంగాణే అని చెప్పారు. అయితే ఈ నెల 16న మంత్రివర్గ సమావేశానికి వెళ్లే విషయంలో నేతలలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

English summary
Telangana Congress leaders give another chance to party high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X