వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అనా హజారే అవినీతిపడుడు', కాంగ్రెసు ఎదురుదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
హైదరాబాద్ : అవినీతిపై పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నా సామాజిక కార్యకర్త అన్నా హజారేపై కాంగ్రెసు ఎదురుదాడికి దిగింది. ఇప్పటి వరకూ నీతులు చెబుతున్న హజారే సచ్చీలుడేమీ కాదని కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. అంతేకాకుండా 2005 నాటి సావంత్ కమిషన్ నివేదికను బయటకు తీసింది. అన్నా హజారే ఒక పద్ధతి ప్రకారం దేశాన్ని అస్థిర పరచే ప్రయత్నాలు చేస్తున్నారని అభాండం వేసింది. జన లోక్‌పాల్ బిల్లు దేశంలో అవినీతిని సమూలంగా నిర్మించగలదని అన్నా హజారే గ్యారంటీ ఇవ్వగలరా అని సవాల్ విసిరింది. ఆయన దేశప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. అన్నా పబ్లిసిటీ కోరుకుంటున్నారని, టీవీల్లోనూ పత్రికల్లోనూ కనిపించడానికే ఇలా చేస్తున్నారని, తన డిమాండ్లతో ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటు అధికారాలను సవాల్ చేస్తున్నారని తేల్చేసింది.

ముగ్గురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధికార ప్రతిని«ధి అన్నాపై ఆరోపణల వర్షం కురిపించారు. ఎదురుదాడితో ధ్వజమెత్తారు. ట్రస్టుల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్నా బృందంలో నియంతలున్నారని అన్నారు. అన్నా దీక్షను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆత్మహత్యతో పోల్చారు. వారి ఆరోపణలకు అన్నా, ఆయన బృందం దీటుగా స్పందించింది. తప్పు చేస్తే తనను జైల్లో పెట్టాలని అన్నా సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఆరోపణలు ఆ పార్టీ ఆందోళనను సూచిస్తున్నాయని ఆయన బృందం ఎద్దేవా చేసింది. అరెస్ట్ చేస్తే జైల్లోనే దీక్షలు కొనసాగిస్తామని ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X