హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డెక్కిన బాబు: హజారే అరెస్టుకు నిరసనగా ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతిపై అవిశ్రాంత ఉద్యమం చేస్తున్న సామాజిక సంఘ సంస్కర్త అన్నాహజారే అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హఠాత్తుగా రోడ్డెక్కారు. అన్నా అరెస్టును నిరసిస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుండి టాంకుబండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీగా పాదయాత్ర నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఓ సమావేశంలో ఉన్న చంద్రబాబు అన్నాహజారేను పోలీసులు అరెస్టు చేశారనే విషయం తెలియగానే సమావేశాన్ని అర్థాంతరంగా ముగించుకొని నిరసన చేపట్టారు. చంద్రబాబు పాదయాత్రలో టిడిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుమారు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.

బాబు పాదయాత్రకు పలువురు మద్దతు పలికారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి, న్యాయవ్యవస్థను లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరు పౌరహక్కులను హరించే విధంగా ఉందని ఆరోపించారు. అన్నా అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. టిడిపి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. దీక్షలు చేయడం ప్రజాస్వామిక హక్కు అని అన్నారు.

English summary
Telugudesam party president Chandrababu Naidu make padayatra today against Anna Hazare arrest. He condemned Hazare arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X