హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నా మద్దతు దీక్షలో కోదండరామ్‌‌కు చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya-Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు మంగళవారం చుక్కెదురయింది. ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు మద్దతుగా ర్యాలీలు, దీక్షలు ప్రారంభించారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనూ పలువురు అన్నాకు మద్దతుగా దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద పలువురు విద్యార్థులు అన్నాకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు.

వారికి మద్దతు ప్రకటించడానికి బిజెపి నేత బండారు దత్తాత్రేయ వెళ్లారు. ఆ తర్వాత జెఏసి నేత కోదండరామ్ వెళ్లారు. అయితే వీరిని వారు దీక్షా శిబిరం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నాయకులు వెనక్కి వెళ్లాలి అంటూ నినాదాలు చేశారు. అన్నా హజారే అరెస్టుకు నిరసనగా చేస్తున్న దీక్ష శిబిరంలోకి రాజకీయ నేతలను అనుమతించేది లేదని వారు చెప్పారు.

English summary
Students obstructed Telangana Political JAC chairman Kodandaram and BJP senior leader Bandaru Dattatreya today at Indira Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X