హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పహిల్వాన్ హోటల్ కూల్చివేతకు యత్నం, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఓ హోటల్‌ను కూలగొట్టే యత్నంలో రాజధానిలోని పాతబస్తీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చాంద్రాయణ గుట్టలోని మహమ్మద్ పహిల్వాన్‌కు చెందిన ఉమర్ హోటల్‌ను గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు మంగళవారం కూలగొట్టేందుకు వెళ్లారు. కట్టడం నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆరోపిస్తూ జిహెచ్ఎంసీ అధికారులు హోటల్ కూలగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితే దీనిని పహిల్వాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు. మహ్మద్ పహిల్వాన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే హోటల్‌ను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

పహిల్వాన్ మద్దతుదారులు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పరిస్థితి తీవ్రతను గమనించి భారీగా పోలీసులను మోహరించారు. అయితే హోటల్‌పై కోర్టులో కేసు నడుస్తోందని కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆగాల్సిందిగా హోటల్ నిర్వాహకులు డిసిపిని కోరారు. దీంతో డిసిపి పోలీసులను వెనక్కి పంపించారు. పోలీసులను వెనక్కి పంపడంతో ఉద్రిక్తత తగ్గింది. అయితే కోర్టు నిర్ణయం తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని జిహెచ్ఎంసీ భావిస్తోంది.

English summary
Mohammad Pahilwan Hotel created tension in old city of Hyderabad today. GHMC tried to destroy hotel building by rules. Pahilwan supporters obstructed them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X