విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.50 కోట్లతో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లాలో ఓ చిట్ ఫండ్ కంపెనీ 50 కోట్ల రూపాయల వరకు టోకరా వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడలో విజయకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ పేరుతో నాగేశ్వర రావు అనే వ్యక్తి నడుపుతున్నాడు. గతంలో ఆయన వ్యాపారాలు చేశాడు. ఆయన గతంలో చాలా రకాల వ్యాపారాలు చేయడంతో పలువురుతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని పదిహేనేళ్ల క్రితం అతడు చిట్ ఫండ్ కంపెనీ స్థాపించాడు. తమతో కలిసి వ్యాపారాలు చేసిన వ్యక్తి స్థాపించినందు వల్ల చాలా మంది వ్యాపారులు ఆయన చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టారు. అంతేకాకుండా ఎక్కువ వడ్డీ ఆశ చూపడంతో భారీగా డబ్బులు వచ్చి చేరాయి.

అయితే గత ఆరు నెలలుగా ఇస్తానన్న వారికి అతను డబ్బులు ఇవ్వక పోవడమే కాకుండా ఇవ్వాల్సిన వడ్డీలు సైతం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇటీవల తాము వారం రోజులు ఉండటం లేదని బోర్డు పెట్టాడు. అయితే ఆయన తీరుపై పలువురుకి అనుమానం వచ్చింది. కొందరు నిలదీయడంతో బుధవారం డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. బుధవారం వచ్చినప్పటికీ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ లేక పోవడంతో షాక్‌కు గురి కావడం బాధితుల వంతయింది. చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్ మాత్రమే కాకుండా ఫైనాన్సు కూడా నడిపేవాడు.

English summary
A chitfund company cheated Rs.50 crores in Vijayawada. Victims complainted in police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X