• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాత్రంతా తీహార్ జైల్లోనే అన్నా హజారే, మొరాయింపు

By Pratap
|

Anna Hazare
న్యూఢిల్లీ: అరెస్టయిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం రాత్రంతా తీహార్ జైల్లోనే ఉన్నారు. విడుదల చేసినా తాను వెళ్లేది లేదని మొరాయించి కూర్చున్నారు. ఏ విధమైన షరతులు లేకుండా జెపి పార్కులో దీక్ష చేయడానికి అనుమతి ఇస్తేనే తాను జైలు కదులుతానని ఆయన పట్టుబట్టి కూర్చుకున్నారు. రాత్రి గడపడానికి జైలు అధికారులు ఆయనకు ఓ గదిని కేటాయించారు. అరెస్టు చేసిన అన్నా హజారేను కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ జోక్యంతో విడుదల చేశారు.

అన్నా హజారే అరెస్టుతో దేశమంతా భగ్గుమంది. ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. ఏడు రోజులు హజారేకు జ్యుడిష్యల్ కస్టడీ విధించినప్పటికీ దేశవ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనతో 12 గంటల్లోనే ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హజారే జైలులోనే తన దీక్షను కొనసాగించారు. కిరణ్ బేడీని, ప్రశాంత్ భూషన్‌ను మంగళవారం రాత్రి జైలు అధికారులు విడుదల చేశారు.

English summary
After Anna Hazare's refusal to walk out, Tihar jail authorities allotted him a room to spend night in the jail, TV channels reported. Anna is continuing his fast in the Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X