వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గిన కాంగ్రెసు, పండిట్ రవిశంకర్ జోక్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Sri Ravi Shankar-Anna Hazare
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష విషయంలో కాంగ్రెసు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆయన దీక్షకు అనుమతించాలని నిర్ణయించుకుంది. అన్నా హజారేకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి పండిట్ రవిశంకర్ జోక్యం చేసుకున్నారు. తీహార్ జైలులో ఉన్న అన్నా హజారేను శ్రీశ్రీ రవిశంకర్ కలిశారు. యోగా గురు రామ్ దేవ్ బాబా కూడా ఆయనను కలిశారు. మంగళవారం రాత్రి నుంచి తీహార్ జైలులోనే అన్నా హజారే దీక్ష చేస్తున్నారు.

రామ్ లీలా మైదానంలో అన్నా హజారే దీక్షకు అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. జెపి పార్కు చుట్టుపక్కల 144వ సెక్షన్‌ను ఎత్తేయడానికి కూడా పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. రవిశంకర్ అన్నా హజారే భేటీ అయినప్పుడు కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్, స్వామి అగ్నివేష్, మేధా పాట్కర్, మనిష్ సిసోడియా తదితరులు ఉన్నారు. రామ్ దేవ్ బాబా మంగళవారం ఉదయం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి - అన్నాను పోలీసులు అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఓ వినతిపత్రం సమర్పించారు.

English summary
Even as the standoff in Tihar Jail continues Wednesday with supporters of Anna Hazare waiting for the Gandhian to come out of prison, intervention of Sri Sri Ravi Shankar was sought to break the impasse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X