హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణక తిలోదకాలు, కాంగ్రెసు నేతలు రెడీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై కాంగ్రెసు అధిష్టానం తెలివిగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అధిష్టానం సూచనల మేరకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు నాటకాన్ని రక్కి కట్టించారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ మంత్రులు హాజరు కావడం ఆ విషయాన్ని తెలియజేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్దేశం కాంగ్రెసు అధిష్టానానికి లేదని పలు సందర్భాల్లో వెల్లడైంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మాటలు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.

తెలంగాణ ఏర్పాటు డిమాండు ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసిన ప్రతిసారీ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఓ డ్రామాకు తెర తీస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల రాజీనామాల వ్యవహారం కూడా ఓ ప్రహసనంగా మారింది. ఇదంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ పేరాను తొలగించడం ద్వారా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కొంత వెసులుబాటు లభించింది. తద్వారా రాజీనామాల విషయాన్ని వెనక్కి తోసేసి తమ పనులు తాము ప్రభుత్వపరంగా చేసుకుపోవడానికి పూనుకున్నారు.

శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయంలోని సూచనలను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం పకడ్బందీగా అమలు చేస్తోందని అంటున్నారు. తద్వారా రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వెనక్కి నెట్టడం అందులో భాగం. అందుకు అనుగుణంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాతం నాయకులు నడుచుకోవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. 2014 వరకు తెలంగాణ అంశాన్ని నాన్చడానికి అవసరమైన ప్రణాళిక కాంగ్రెసు అధిష్టానం వద్ద ఉందని చెబుతున్నారు.

English summary
It is said that Congress Telangana leaders are ready to act according to the tunes of its high command to postpone Telangana demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X