వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్ కేసు, చంద్రబాబు ప్రభుత్వంపైకి నెట్టిన ఆచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయింపు వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బిపి ఆచార్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపైకి నెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారని వార్తలు వస్తున్నాయి. సిబిఐ అధికారులు గురువారం బిపి ఆచార్య నివాసంలో సోదాలు నిర్వహించారు. సిబిఐ అధికారులతో ఆయన పలు విషయాలు చెప్పినట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాదులో ఐటి పరిశ్రమ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గచ్చిబౌలిలో ఇంటర్నెట్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు, అందుకుగాను గ్లోబల్ టెండర్లు ఆహ్వానించామని, అర్హత సాధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయించినట్లు, ఇందులో తన సొంత వ్యవహారమేమీ లేదని బిపి ఆచార్య చెప్పినట్లు సమాచారం. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎపిఐఐసికి మధ్య ప్రభుత్వ వాటాలో 26 శాతం కేటాయింపు జరిపినట్లు ఆయన చెప్పినట్లు ఆయన తెలిపారు. మారుతున్న కాలంలో కొత్త తరహా వాణిజ్యంలో భాగంగా 6 శాతం వాటా తగ్గించినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి జరిగిన విషయాలపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

ఆచార్య నివాసంలో సిబిఐ అధికారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయింపుల్లో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు భూమి కేటాయింపుపై అడగాల్సింది ఎమ్మార్ ప్రాపర్టీసేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
According to TV channel reports - BP Acharya said to CBI officers that the agreement was signed in TDP Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X