హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ లేకుండా ఇంట్లో సిబిఐ సోదాలా: జూపూడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆయన లేకుండా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం సరి కాదని ఆ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించి ఇంట్లో సోదాలు చేయాల్సి ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ సోదాలతో జగన్ పసిపిల్లలు భయపడుతున్నారని, మహిళలు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. సోదాల విషయంలో సిబిఐ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉండిందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ప్రజల మధ్య ఓదార్పు యాత్రలో ఉండగా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసులో ఉండి ఉంటే రాజాలాగా బతికేవారని ఆయన అన్నారు. తనకు అడ్డొచ్చినవారిని సహించలేని స్థితిలో కాంగ్రెసు ఉందని, అన్నా హజారే గానీ జగన్ గానీ ఎవరైనా సరే కాంగ్రెసు సహించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్‌పై కక్ష తీర్చుకుంటున్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే అలా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముప్పయి ఏళ్ల పాటు కాంగ్రెసుకు సేవలు చేసిన వైయస్ కుటుంబానికి దీనస్థితిని కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు గుండాగిరి, దౌర్జన్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
YSR Congress party leader Jupudi Prabhakar Rao opposed the type of CBI raids on YS Jagan's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X