వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ థర్డ్ ఫ్రంట్ పాత్ర, ఢిల్లీలో చంద్రబాబు ఫోకస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష చేపట్టిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్‌కు మళ్లీ ప్రాణం లేచొచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా జరిపే పోరాటానికి కార్యాచరణ రూపొందించేందుకు తృతీయ ఫ్రంట్ నాయకులు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఎబి బర్దన్ (సిపిఐ), ప్రకాష్ కారత్ (సిపిఐ), దేవెగౌడ (జెడి-యు), అజిత్ సింగ్ (ఎల్‌జెపి), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం) తదితరులు సమావేశమై అవినీతికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

అవినీతిపై పోరాటం కొనసాగుతుందని సమావేశానంతరం ప్రకాష్ కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవినీతిపై మాట్లాడితే ప్రభుత్వం నోరు నొక్కుతోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తొమ్మిది పార్టీలు ఈ నెల 26వ తేదీన ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లును వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతిపై పార్లమెంటులో తమ వాదనలు వినిపించినా లాభం లేకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు. తాము మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం సాగించామని ఆయన గుర్తు చేశారు.

English summary
Third front at national level became active in the context of Anna Hazare's fast against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X