వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన అన్నా హజారే

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: తీహార్ జైలు నుంచి సామాజిక కార్యకర్త అన్నా హజారే మూడు రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవినీతిపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తన మద్దతుదారులే తన బలమని ఆయన చెప్పారు. తాను ఉన్నా లేకున్నా అవినీతిపై పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. అవినీతి అంతమయ్యే వరకు పోరాటం సాగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జైలు వద్దకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు.

తీహార్ జైలు నుంచి ఆయన రామ్‌లీలా మైదాన్‌కు బయలుదేరారు. ఆయన దీక్ష కోసం రామ్‌లీలా మైదానం పూర్తిగా సిద్ధమైంది. అక్కడికి చాలా మంది చేరుకున్నారు. అన్నా హజారే దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగి వచ్చి రామ్ లీలా మైదానంలో అన్నా హజారే 15 రోజుల పాటు దీక్ష చేయడానికి అనుమతి ఇచ్చింది. రామ్‌లీలా మైదానానికి చేరుకునే ముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు.

English summary
Anna Hazare came out of Tihar Jail today and will go to Rajghat, the samadhi of Mahatma Gandhi, before he launches his fortnight long protest from Ramlila Ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X