వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు తెల్చే వరకు రామ్‌లీలా మైదానంలోనే: అన్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: పార్లమెంటులో జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదించే వరకు రామ్‌లీలా మైదానాన్ని వదిలేది లేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. మూడు రోజుల తర్వాత ఆయన తీహార్ జైలును వదిలి రామ్‌లీలా మైదానం చేరుకుని వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో అన్నా హజారేకు నినాదాలతో ప్రజలు హర్షధ్వానాలు పలికారు. వర్షంలోనే ఆయన ప్రసంగం సాగింది. వర్షం వారి దీక్షను కదిలించలేకపోయింది.

స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లు గడిచినా పూర్తి స్వేచ్ఛ అనుభవించలేకపోతున్నామని ఆయన అన్నారు. పోరాటం ముగిసిపోలేదని, ఇప్పుడే ప్రారంభమైందని ఆయన అన్నారు. అన్నా కోసం నిరీక్షిస్తున్నవారు దైవానికి ప్రార్థనలు చేశారు. భారత్ యావత్తూ అన్నా అంటూ నినాదాలు చేశారు. తీహార్ జైలు నుంచి ఆయన రాజ్‌ఘాట్‌కు ఊరేగింపుగా వెళ్లారు. వర్షం వల్ల ఊరేగింపు వేగంగా సాగలేదు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఊరేగింపు అమర్ జవాన్ జ్యోతి, ఇండియా గేట్ మీదుగా రామ్‌లీలా మైదానికి చేరుకుంది.

English summary
After three days in jail, anti-corruption crusader Anna Hazare reached Ramlila Maidan and addressed thousands of supporters urging them to continue the fight for a strong Lokpal Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X