వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీపై సాక్ష్యాలున్నాయి: జగన్ వర్గ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra bose and Konda Surekha
హైదరాబాద్: తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావును, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రామోజీరావు అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాలున్నాయని వారన్నారు. రామోజీ మార్గదర్శిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాస్తే ఎందుకు విచారణ జరిపించలేదని వారడిగారు. రామోజీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. జగన్ వర్గానికి చెందిన దాదాపు పది మంది శాసనసభ్యులు శుక్రవారం సాయంత్రం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

ఒక సామాన్యుడు వేసిన కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిబిఐ విచారణపై చంద్రబాబు స్టే మాత్రమే తెచ్చుకున్నారని, అది ముగిసిపోలేదని ఆయన అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్‌పై సిబిఐ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు, రామోజీ రావు కుమ్మక్కయి జగన్‌ను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్‌పై కక్ష సాధిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా జగన్ ఆస్తులపై అత్యంత వేగంగా దాడులు చేయడమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడానికి నిదర్శనమని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో చంద్రబాబుకు, మంత్రులకు స్థలాలు ఉన్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబును, వైయస్సార్ మంత్రి వర్గ సభ్యులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కుట్ర కారణంగా కేసులు వేయడం వల్లనే స్టే కోసం జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ వ్యాపార దక్షత వల్లనే చాలా మంది పెట్టుబడులు పెట్టారని, జగన్‌పై కేసుల విషయంలో న్యాయవ్యవస్థపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అవసరమైనప్పుడు తాము రాజీనామాలు చేస్తామని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

English summary
YSR Congress president YS Jagan camp MLAs lashed out at Eenadu Ramoji Rao for CBI raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X