న్యూఢిల్లీ: ప్రభుత్వ కోశాగారాలకు దొంగల నుంచి ప్రమాదం లేదని, వాటిని రక్షించాల్సినవారి నుంచే ప్రమాదం ఉందని, ఆ ద్రోహుల వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదించే వరకు తాను దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నా హజారే దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరుకుంది. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం నుంచి అటువంటి సూచనలేవీ లేవని అన్నా బృందం చెప్పింది. దేశాన్ని శత్రువులు మోసం చేయడం లేదని, ఆ ద్రోహులే మోసం చేస్తున్నారని అన్నా హజారే అన్నారు.
అన్నా హజారే మూడున్నర కిలోల బరువు తగ్గారు. కొద్గిగా బలహీనంగా అనిపిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోరాటం కొనసాగుతుందని అన్నా హజారే అన్నారు. కాగా, తాము పటిష్టమైన లోక్ పాల్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. బిల్లు ఆమోదం పొందడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు.
Anna Hazare's fast demanding a strong Lokpal entered the fifth day on Saturday with his team saying they were ready to talk to the government but no such communication channels have been opened.
Story first published: Saturday, August 20, 2011, 15:14 [IST]