వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ విజయమ్మకు టిడిపి నేత దేవేందర్ గౌడ్ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devendar Goud
హైదరాబాద్‌: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి నుండి రాష్ట్ర ప్రజల దృష్టి నుండి మరల్చడానికి వేస్తున్న అనేక ఎత్తుగడల్లో భాగమే పులివెందుల శాసనసభ్యురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ లేఖ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆదివారం అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఇలా మాట్లాడే వారా అని ఆయన విజయమ్మను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వక పోవటంతో వైయస్ కుటుంబానికి అప్పటి నాటి దేవతలు ఇప్పుడు దెయ్యాలుగా మారారని ఎద్దేవా చేశారు.

విజయమ్మ రాసిన లేఖలో ఎక్కడా వైయస్ హయాంలో అవినీతి జరగలేదని, జగన్ నిర్దోషి అని ప్రస్తావించలేదని దానిని తాము పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వారి బాధంతా రాజీవ్ గాంధీ, బొత్స సత్యనారాయణ, రోశయ్య వాళ్లంతా దోపిడీ చేసినప్పుడు సిబిఐ నుంచి తప్పించినట్లుగా ఇప్పుడు మమ్మల్ని తప్పించాలని లేఖ రాసినట్లుగా కనిపిస్తోందన్నారు. జగన్‌తో పాటు కెవిపి, అహ్మద్ పటేల్, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, లగడపాటి శ్రీధర్ పైనా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TDP leader Devendar Gour questioned Pulivendula MLA YS Vijayamma on her letter to Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X