వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా ఎఫెక్ట్, ప్రధాని నుంచి పట్టాకు ఐఐటి విద్యార్థి నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటానికి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ చేతుల మీదుగా పట్టాను తీసుకోవడానికి ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి నిరాకరిస్తున్నారు. మరో విద్యార్థి అన్నా టోపీ ధరించి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతున్న స్నాతకోత్సవంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

శశి శేఖర్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఎంటెక్ పట్టాను స్వీకరించబోనని ప్రకటించాడు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకు అంగీకరించకపోవడం వల్లనే తాను ప్రధాని చేతుల మీదుగా పట్టా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ విద్యార్థి చెప్పాడు. జన్ లోక్‌పాల్ బిల్లును సమర్థించేవారి చేతుల మీదుగా పట్టాను తీసుకుంటానని అతను చెప్పాడు.

చంద్ర కుమార్ పటేల్ అనే ఎలక్ట్రానిక్స్ ఎంటెక్ విద్యార్థి స్నాతకోత్సవంలో అన్నా హజారే ధరించినటువంటి గాంధీ టోపీ ధరిస్తానని చెప్పాడు. సంప్రదాయబద్దమైన స్నాతకోత్సవ టోపీని కాదని తాను ఆ టోపీని ధరిస్తానని అతను చెప్పాడు. హజారేకు మద్దతుగా ఖరగ్‌పూర్ ఐఐటి విద్యార్థుల కొందరు దీక్ష కూడా చేస్తున్నారు.

English summary
It has been evident that 74-year old Anna Hazare's passion and determination over stronger anti-corruption bill have gripped the students of India's top institution. One of the students of IIT-Kharagpur refused to accept his degree from Singh while another aims to wear an Anna cap at the convocation where the Prime Minister is the chief guest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X