• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నాకు మద్దతు, నగ్నంగా డ్యాన్స్ చేస్తానంటున్న నటి

By Pratap
|

Salina Wali Khan
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారేకు మద్దతు తెలియజేయడానికి ఢిల్లీకి చెందిన నటి, మోడల్ సలీనా వాలి ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జన్‌ లోక్‌పాల్ బిల్లును ఆమోదించకపోతే దుస్తులు విప్పేసి నృత్యం చేస్తానని ఆ భామామణి ప్రకటించింది. తాను ప్రచారం కోసం ఈ ప్రకటన చేయడం లేదని ఆమె చెబుతోంది.

తాను ప్రచారం కోసం ఆ నిర్ణయం తీసుకోలేదని, అందరి దృష్టిని ఆకర్షించడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మోడళ్లతో తనను పోల్చవద్దని, పేరు సంపాదించుకోవడానికి తాను ఈ పని చేయడం లేదని, సామాన్యుల కోసం అలా చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆ ముద్దుగుమ్మడు మిడ్ డేతో అన్నది. తాను కూడా అవినీతి బాధితురాలినని చెప్పుకుంది.

ఢిల్లీ పోలీసులపై ఆమె మండిపడింది. తాను ఫిర్యాదు ఇస్తే వారు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అన్నా అమాయకుడని, సామాన్యుల కోసం పని చేస్తున్నారని ఆమె అన్నది.

English summary
A Delhi-based actor and model Salina Wali Khan has found a unique way to express solidarity with Anna Hazare. She has claimed that since she is also a victim of corruption, she will dance naked if the government fails to pass the lokpal bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X