హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కట్టడి కోసం సిఎం సమావేశం: హాజరైన వివేకా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళుతున్న ప్రజాప్రతినిధులను కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జగన్ బాబాయి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి సైతం హాజరు కావడం విశేషం. సోమవారం జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో మరికొందరు ఎమ్మెల్యేలు జగన్‌తో వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, ముఖ్యనేతలతో సిఎం సమావేశం కావడం అందులో వివేకానంద రెడ్డి పాల్గొనడం చర్చానీయాంశం అయింది. జగన్ పార్టీ నుండి బయటకు వెళ్లినప్పుడు వివేకా మాత్రం తాను కాంగ్రెసులోనే ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత జగన్, వివేకా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.

తన అన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని కోరుకునే వారని తాను సైతం తన అన్న దారిలోనే నడుస్తానని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసు తరఫున తన వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు ప్రారంభం అయ్యే వరకు వివేకా కాంగ్రెసు వెంటనే ఉన్నారు. అయితే సిబిఐ దాడులు ప్రారంభమయ్యాక మాత్రం ఆయన జగన్‌కు అండగా నిలిచారు. జగన్‌పై సిబిఐ దాడులు సరికాదని, మా ఇంటా వంటా అవినీతి, అక్రమాలు లేవని ప్రకటించి జగన్‌కు మద్దతు పలికారు. అయితే మంగళవారం మళ్లీ జగన్‌ను కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం విశేషం.

English summary
YSRC party president YS Jaganmohan Reddy's uncle YS Vivekananda Reddy participated in CM Kiran Kumar Reddy's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X