హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ అదుపులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య?

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎపిఐఐసి - ఎమ్మార్ అక్రమాల కుంభకోణం కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను బుధవారం సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు టీవీ చానెళ్లు ఈ వార్తను ప్రసారం చేస్తున్నాయి. బిపి ఆచార్య ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో జరిపిన లావాదేవీలపై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆచార్యను సిబిఐ అధికారులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సిబిఐ హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహం వద్ద మీడియా హడావిడి ఎక్కువగా ఉండడంతో మరో ప్రదేశంలో బిపి ఆచార్యను సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూకేటాయింపులు, వాటా తగ్గింపులపై సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మందిని కూడా సిబిఐ విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ వరదరాజన్‌కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని సిబిఐ అధికారులు ఆయనకు ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం.

English summary
It is learnt that CBI is questioning APIIC ex managing director and IAS officer BP Acharya in undisclosed place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X