హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గంలో బీటలు, రాతపూర్వక హామీకి ఎమ్మెల్యేల పట్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం బీటలు వారినట్లు తెలుస్తోంది. జగన్ వర్గం శానససభ్యులు ఆయన ముందు కొత్త డిమాండ్లను పెడుతుండడంతో చీలికలు వస్తున్నాయి. కొంత మంది డబ్బులను డిమాండ్ చేస్తుండగా, మరికొంత మంది వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు ఇవ్వడమే కాకుండా ఎన్నికల ఖర్చు కూడా భరించాలని పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తుననాయి. వీటికి వైయస్ జగన్ అంగీకరించారా, లేదా అనేది తెలియదు గానీ శాసనసభ్యులు తమ డిమాండ్లపై రాతపూర్వక హామీని కోరుతున్నారు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో వైయస్ జగన్‌ను మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిసి సమయంలో ఆ విషయాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

శాసనసభ్యుల షరతులపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి రాజీనామాలు చేయకపోవడంపై కూడా ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. తాను హైదరాబాదు వచ్చేలోగా ఆ ముగ్గురు కూడా రాజీనామాలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ కోసం చేసిన రాజీనామాలు తిరస్కరణకు గురైనందున తిరిగి రాజీనామాలు చేయాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం రాజీనామాలు చేస్తే తాము తమ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. భూవివాదాలను తేల్చాలని, ఆర్థిక సహాయం అందించాలని శాసనసభ్యులు గొంతెమ్మ కోరికలు విప్పుతున్నట్లు చెబుతున్నారు. పైగా, మరో ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా చాలా మంది శాసనసభ్యులు సిద్ధంగా లేరని చెబుతున్నారు.

English summary
While the Congress has launched a vitriolic campaign against Jaganmohan Reddy on Tuesday, cracks have surfaced in the Jagan camp with some of MLAs putting forth fresh demands to their leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X