హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిబియాలో చిక్కుకు పోయిన మత ప్రచారకుడు కెఏ పాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KA Paul
హైదరాబాద్: ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు కెఏ పాల్ లిబియాలో చిక్కుకు పోయారు. లిబియా అధ్యక్షుడు ముమ్మార్ గడాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు ట్రిపోలీ వైపు దూసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గడాఫీ కోసం ప్రార్థనలు చేయడానికి వెళ్లిన పాల్ అక్కడే చిక్కుకు పోయారు. పాల్ లిబియా ప్రభుత్వం పిలుపు మేరకు పదిహేను రోజుల క్రితం ఆ దేశానికి వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలు సైతం వెళ్లారు. పాల్ ట్రిపోలీలోని ఓ హోటల్‌లో బస చేశారు. అయితే రెండు రోజుల తిరుగుబాటుదారులు లిబియా రాజధాని ట్రిపోలీని సైతం దాదాపుగా ఆక్రమించుకున్నారు. పాల్ బస చేసిన హోటల్‌ను సైతం తిరుగుబాటుదారులు తమ అదుపులోకి తీసుకున్నారు.

తిరుగుబాటుదారులు విరుచుకు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశాలు లేవని పాల్ ఎపిలోని తన సన్నిహితులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. తిరుగుబాటుదారులు తమను డార్క్ రూంలోకి తీసుకెళ్లి ఉంచుతున్నారని, ఫోన్‌లు సైతం తీసుకుంటున్నారని తద్వారా తమకు ఎవరితోనూ సంబంధం లేకుండా ఉంటుందని పాల్ తన సన్నిహితులకు బుధవారం ఉదయం చెప్పారు. తమకు ప్రాణభయం తప్పిపోలేదని పాల్ చెప్పారు. పాల్ ఉన్న హోటల్‌లోనే వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రముఖులు సైతం ఉన్నారు. పాల్ ట్రిపోలీలో చిక్కుకు పోవటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Christian organization campaigner KA Paul in captive at Tripoli of Libya. He went Libya before fifteen days for pray president Mummar Gaddaffi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X